Advertisement

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం మార్పు!

Tamil Nadu Chief Minister office changes after six decades
  • నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తులోకి తరలింపు 
  •  స్థలం కొరత కారణంగానే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం 
  •  వేగంగా సాగుతున్న నూతన సీఎం ఆఫీస్ పునర్నిర్మాణ పనులు 
  • మూడు ప్రభుత్వ శాఖలు కూడా ఇతర ప్రాంతాలకు మార్పు
తమిళనాడు సచివాలయంలో ఒక చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయం త్వరలోనే నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైకి మారనుంది. స్థలం కొరత కారణంగానే సీఎం ఆఫీస్‌ను పదో అంతస్తుకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అక్కడ వేగంగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.

ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సందర్శకులు, అధికారుల తాకిడి బాగా పెరిగింది. పాత కార్యాలయంలో స్థలం సరిపోకపోవడంతో నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తును ఎంపిక చేశారు. అక్కడ నిర్మిస్తున్న కొత్త కార్యాలయం నుంచి బంగాళాఖాతం సముద్ర తీరం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ మార్పుల వల్ల పదో అంతస్తులో ఉన్న సమాచార, తమిళ అభివృద్ధి శాఖలతో పాటు హోం, వాణిజ్య పన్నుల శాఖల కార్యాలయాలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా 1975లో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఈ పది అంతస్తుల భవనాన్ని ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement
C Joseph Vijay
Tamil Nadu CM Office
Fort St George
Namakkal Kavignar Maaligai
Tamil Nadu Secretariat
Chennai Administration

More Telugu News