ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే నష్టం మీకే.. పుతిన్, జిన్‌పింగ్‌కు ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌కు ఆయుధాలు అమ్మొద్దని ట్రంప్ హెచ్చరిక
- జిన్‌పింగ్, పుతిన్ హామీలను నమ్ముతున్నానని వ్యాఖ్య
- ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని ఇద్దరూ చెప్పారన్న ట్రంప్
- ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని ట్రంప్ స్పష్టీకరణ
ఇరాన్‌కు చైనా, రష్యా ఎలాంటి ఆయుధాలు విక్రయించకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అలా చేస్తే అది ఆ రెండు దేశాల ప్రయోజనాలకు మంచిది కాదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌కు ఆయా దేశాలు ఆయుధాలు అందించడం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
ఇరాన్‌కు చైనా, రష్యా లక్ష్యాన్ని నిర్ధారించుకునే సమాచారాన్ని అందిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే నెలలో బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలిసినప్పుడు ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వం’’ అని ఆయన హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. తమ మధ్య ఉన్న సంబంధాల కారణంగా ఆ మాటను తాను విశ్వసిస్తున్నానన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇదే హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. తాను ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు విక్రయించడం లేదని, నాటో దేశాలకు మాత్రమే అమ్ముతున్నానని చెప్పారు. అవి తర్వాత ఎలా పంపిణీ అవుతున్నాయో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్.. షీ జిన్‌పింగ్, పుతిన్ ఇద్దరూ ఇచ్చిన హామీలను తాను నమ్ముతున్నానని మరోసారి స్పష్టం చేశారు. తాను నిరాశ చెందేలా వారు వ్యవహరించరని భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచంలోని ప్రధాన దేశాల నాయకులుగా వారిని గౌరవించాల్సిందేనని కూడా ట్రంప్ పేర్కొన్నారు.