కీప్యాడ్ ఫోనే నయం: హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్
- స్మార్ట్‌ఫోన్, ఈమెయిల్ ఐడీ తనకు లేవన్న క్రిస్టోఫర్ నోలన్
- స్మార్ట్‌ఫోన్ ఉంటే దానికి పూర్తిగా బానిసనైపోతానని ఆందోళన
- ప్రయాణ సమయాల్లో కేవలం కీప్యాడ్ ఫోన్ మాత్రమే వాడుతానని వెల్లడి
- ఖాళీ సమయంలోనే కొత్త సినిమాల ఆలోచనలు వస్తాయన్న ‘ది ఒడిస్సీ’ దర్శకుడు
ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సాంకేతిక అలవాట్ల గురించి సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ఆధునిక యుగంలో కూడా తాను ఎలాంటి స్మార్ట్‌ఫోన్ గానీ, కనీసం ఈమెయిల్ ఐడీ గానీ వాడనని తెలిపారు. 'ది టునైట్ షో విత్ జిమ్మీ ఫాలోన్' కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన తన డిజిటల్ రహిత జీవితశైలి గురించి మాట్లాడారు.
క్రిస్టోఫర్ నోలన్ తీసే సినిమాల షూటింగ్ సెట్‌లో ఎవరికీ సెల్‌ఫోన్లు అనుమతించరనే విషయం తెలిసిందే. దీనిపై జిమ్మీ ఫాలోన్ ప్రశ్నించగా.. అది నిజమేనని నోలన్ తెలిపారు. ఈమెయిల్స్, మెసేజ్‌లు లేకుండా అంతటి భారీ చిత్రాలను ఎలా తీస్తారని అడగ్గా "నా చుట్టూ ఎప్పుడూ సాయం చేసే సిబ్బంది ఉంటారు. కాబట్టి నాకు అందాల్సిన సమాచారం ఆగిపోవడం అంటూ జరగదు" అని ఆయన వివరించారు.
స్మార్ట్‌ఫోన్ వాడకంపై తనకున్న భయాన్ని నోలన్ బయటపెట్టారు. "ఒకవేళ నా దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే, నేను దానికి ఘోరంగా బానిసనైపోతానని భావిస్తున్నాను. ప్రయాణాలు చేసేటప్పుడు నేను కేవలం ఒక సాధారణ కీప్యాడ్ ఫోన్ మాత్రమే వాడతాను. ఫోన్ చూడకుండా ఊరికే కిటికీలోంచి బయటకు చూస్తూ ప్రశాంతంగా ఆలోచించే సమయాన్ని నేను ఎంతో విలువైనదిగా భావిస్తాను. ఆ సమయంలోనే నా తదుపరి చిత్రం ఏంటి అనే ఆలోచనలు నాకు వస్తాయి" అని ఆయన చెప్పారు.
రెండు ఆస్కార్ అవార్డులతో పాటు ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న నోలన్, 21వ శతాబ్దపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా పేరుగాంచారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'ది ఒడిస్సీ' ఇటీవల విడుదలైంది. ప్రాచీన గ్రీకు కావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఫాంటసీ చిత్రంలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, యాన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా వంటి ప్రముఖ నటులు నటించారు.