భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. సమీక్షలో మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
- ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతం పలకాలన్న లోకేశ్
- ప్రారంభోత్సవానికి 3లక్షల మంది హాజరయ్యేలా పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
- కూటమి నాయకులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచన
ఉత్తరాంధ్ర మణిహారంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని "నభూతో నభవిష్యత్" అనే రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని బహిరంగ సభను దిగ్విజయం చేయాలని ఆయన కోరారు.
"ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతూ సుమారు 13 వేల మంది కళాకారులతో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలి. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభకు హాజరయ్యే ప్రజల కోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేల బస్సులను సిద్ధం చేస్తున్నాం. ప్రజలు బస్సు ఎక్కిన సమయం నుండి తిరిగి క్షేమంగా వెళ్లే వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మండల స్థాయి లైజన్ అధికారులు పర్యవేక్షించాలి. సభకు వచ్చే వారందరికీ తాగునీరు, అల్పాహారం, భోజన వసతులు కల్పించాలి" అని లోకేశ్ సూచించారు. అనంతరం ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ.. ప్రధాని బహిరంగ సభను వీక్షించేందుకు ప్రతి 5 వేల మందికి ఒక ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత పీవీఎన్ మాధవ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారి రాజేశ్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎంపీ చింతకాయల విజయ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కార్యక్రమాల కమిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణరాజు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు (విజయనగరం), కిమిడి కళా వెంకట్రావు (చీపురుపల్లి), కోండ్రు మురళీమోహన్ (రాజాం), లోకం నాగమాధవి (నెల్లిమర్ల), వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్, విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ ఎం.ఎం. నాయక్, ఏపీ గిరిజన కార్పొరేషన్ ఎండీ ఎస్.ఎస్. శోభిక, విశాఖపట్నం రేంజి ఐజీ గోపినాథ్ జెట్టి, రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, విజయనగరం ఎస్పీ దామోదర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ భార్గవి, ప్రోటోకాల్ (జీఏడీ) డైరెక్టర్ మోహన్ రావు, విజయనగరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.