భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ... ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం
- ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి లోకేశ్ నేతృత్వంలో మంత్రుల సంఘం సమీక్ష
- ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం
- ప్రధాని రాక సందర్భంగా విద్యార్థినులతో థింసా నృత్య ప్రదర్శనకు నిర్ణయం
- అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచన
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన ఉండవల్లిలో ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రుల సంఘం ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో సమీక్షించింది. ఈ సందర్భంగా, విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బహిరంగ సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, భద్రతాపరమైన అంశాలు, గ్యాలరీలు, గ్రీన్ రూమ్స్, జన సమీకరణ, పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లపై వారు మంత్రులకు తెలిపారు. అధికారుల వివరణ అనంతరం మంత్రుల సంఘం పలు కీలక సూచనలు చేసింది.
ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా, పెద్ద సంఖ్యలో విద్యార్థినులతో థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. అలాగే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ విశిష్టతను తెలిపేలా ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేయాలని చర్చించారు.
అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మంత్రుల సంఘం అధికారులకు స్పష్టం చేసింది. ఈ సమావేశంలో మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ప్రధాని పర్యటన నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.