ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతన పెంపు ప్రకటన
- అక్టోబర్ నుంచి అమలుకానున్న వేతన పెంపు
- సీనియర్ ఉద్యోగులకు జనవరి నుంచి పెంపు
- మొదటి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా నిర్ణయం
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వేతనాలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గురువారం కంపెనీ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన సందర్భంగా సీఈఓ సలీల్ పరేఖ్ ఈ కీలక ప్రకటన చేశారు.
వేతనాల పెంపు ప్రక్రియ దశలవారీగా ఉంటుందని పరేఖ్ వివరించారు. మెజారిటీ ఉద్యోగులకు అక్టోబర్ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని, సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి వేతనాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో, ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టిపెట్టుకోవడంతో పాటు వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తొలి త్రైమాసిక ఫలితాలపై సలీల్ పరేఖ్ స్పందిస్తూ, ప్రస్తుతం సంస్థ వద్ద భారీ డీల్స్ రూపంలో మెరుగైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు నెమ్మదించినప్పటికీ, ఈ ఒప్పందాలను ఆదాయంగా మలచుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూనే, కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలను చేరుకునే వ్యూహంలో భాగంగానే ఈ వేతన పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.