బంగారం ధరలు ఈ వారం కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకరోజు ధర పెరగడం, మరుసటి రోజే తగ్గడంతో పసిడి మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.

గురువారం ఉదయం నాటి ధరల ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,300గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,440గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,720 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,54,900గా పలుకుతోంది.

తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రధాన నగరాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో హైదరాబాద్ తరహా ధరలే ఉండగా, ఢిల్లీ, వడోదర నగరాల్లో మాత్రం స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి. బంగారం ధరలు నిత్యం మారుతుంటాయి కాబట్టి, వినియోగదారులు కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం.