చంద్రబాబుకు 'వాటర్ మ్యాన్' కితాబు.. సాగునీటి రంగంలో సీఎం కృషికి దేశం గుర్తింపు: ఆర్థిక మంత్రి పయ్యావుల
- ముఖ్యమంత్రిని 'వాటర్ మ్యాన్'గా కీర్తించిన 'ఎకనమిక్ టైమ్స్'
- కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావించిన మంత్రి పయ్యావుల
- సాగునీటి రంగంలో కృషికి సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్
- డీఎస్సీపై వాస్తవాలు వివరించిన మహిళా అధికారులను అభినందించిన సీఎం
కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశంసల వర్షం కురిపించారు. సాగునీటి రంగంలో చంద్రబాబు చేస్తున్న కృషిని వివరిస్తూ, ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ఎకనమిక్ టైమ్స్' ఆయన్ను 'వాటర్ మ్యాన్'గా కీర్తిస్తూ కథనం రాసిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందన సూచకంగా సదస్సులో ఉన్నవారంతా నిలబడి చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. "నీటి వనరుల రంగంలో మనం సాధించిన విజయాలను దేశం గుర్తించింది. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల గురించి ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిశ్శబ్ద పురోగతి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు" అని అన్నారు.
మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సులోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారని, దాని ఫలితంగానే హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వగలిగామని వివరించారు.
గతంలో పట్టిసీమ ప్రాజెక్టును కొందరు వ్యతిరేకించినా, దాని ద్వారా ఇప్పటివరకు 500 టీఎంసీల నీటిని తరలించగలిగామని, ప్రకాశం బ్యారేజీని 200 సార్లు నింపి డెల్టాకు నీరందించామని పయ్యావుల తెలిపారు. రైతుల కోసం సీఎం పడుతున్న తపనను దేశం గుర్తించిందని, ఆయన సాధించిన విజయమే రాష్ట్ర అభివృద్ధి అని కొనియాడారు.
మహిళా అధికారులకు సీఎం అభినందన
ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు మహిళా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలు వివరించారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణిలకు కితాబిచ్చారు.
"మనం సమర్థవంతంగా డీఎస్సీని నిర్వహించాం. దానిపై విమర్శలు వస్తే ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ఆ బాధ్యతను ఈ మహిళా అధికారులు చక్కగా నిర్వర్తించారు" అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.