కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు
- మహిళా పోలీసులతో దురుసు ప్రవర్తన ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు
- కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎఫ్‌ఐఆర్
- అసెంబ్లీ వద్ద చొక్కాలు విప్పి ఇబ్బంది పెట్టారని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
- భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు సహా నలుగురు నేతలపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గేట్ నెం.3 వద్ద మహిళా కానిస్టేబుళ్లు భద్రతా విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో రాజకీయ నినాదాలున్న నల్ల టీ-షర్టులు ధరించి, ప్లకార్డులతో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం అలాంటి దుస్తులు, వస్తువులకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా, బీఆర్ఎస్ నేతలు దుర్భాషలాడారని మహిళా కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హరీశ్‌రావు, కేటీఆర్ తమను అవమానకర రీతిలో దూషించారని ఆమె తెలిపారు. హరీశ్‌రావు తన టీ-షర్టును విప్పి ఓ పోలీసు అధికారిపైకి విసిరి, మహిళా సిబ్బంది ముందే అర్ధనగ్నంగా నిలబడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా అదే విధంగా ప్రవర్తించి, తమకు తీవ్ర ఇబ్బంది కలిగించారని ఫిర్యాదులో వివరించారు.
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దాడి, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం వంటి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.