నువ్వే మాకు పెద్ద ఆశీర్వాదం.. కుమార్తె సితార పుట్టినరోజున నమ్రత ఎమోషనల్ పోస్ట్
- సితార పుట్టినరోజు సందర్భంగా తల్లి నమ్రత శిరోద్కర్ భావోద్వేగ పోస్ట్
- నువ్వు పెరగడం చూడటమే నా జీవితంలో అతి పెద్ద ఆశీర్వాదం అంటూ సందేశం
- మహేశ్, నమ్రత దంపతులకు 2012 జులై 20న జన్మించిన సితార
- 'వంశీ' సినిమా సమయంలో ప్రేమలో పడి 2005లో వివాహం చేసుకున్న జంట
- పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉండాలన్న మహేశ్ కోరికను మన్నించిన నమ్రత
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ కుమార్తె ఘట్టమనేని సితార నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. జులై 20న 14వ ఏట అడుగుపెట్టిన తన గారాలపట్టికి తల్లి నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రేమతో నిండిన శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తె ఎదుగుదలను చూడటమే తన జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
సితార అందంగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ నమ్రత తన సందేశాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలో సితార పచ్చని లాన్‌లో ఒక చెట్టు కింద నలుపు రంగు టాప్, ప్రింటెడ్ స్కర్ట్‌తో స్టైలిష్‌గా కనిపించింది. "నా అందమైన పాపకు.. మా జీవితాలను ఇంత ప్రేమ, సంతోషంతో నింపినందుకు ధన్యవాదాలు. నువ్వు పెరగడం చూడటమే నా జీవితంలో అతి పెద్ద ఆశీర్వాదం. పుట్టినరోజు శుభాకాంక్షలు! లవ్ యూ సో మచ్" అని నమ్రత తన పోస్టులో పేర్కొన్నారు.
సితార 2012 జులై 20న జన్మించారు. మహేశ్-నమ్రత దంపతులకు 2006లో జన్మించిన గౌతమ్ కృష్ణ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, మహేశ్ బాబు, నమ్రత 2000 సంవత్సరంలో 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2005 ఫిబ్రవరి 10న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
గతంలో పలు ఇంటర్వ్యూలలో మహేశ్ బాబు వెల్లడించిన ప్రకారం.. పెళ్లికి ముందే తాను ఒక షరతు పెట్టానని, వివాహం తర్వాత నమ్రత నటనకు దూరంగా ఉండి కుటుంబాన్ని చూసుకోవాలని కోరినట్లు తెలిపారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ, మహేశ్ కోరికను గౌరవించి నటనకు దూరమైన నమ్రత, ఆ నిర్ణయం పట్ల తనకు ఎలాంటి విచారం లేదని, కుటుంబ జీవితాన్ని సంతోషంగా స్వీకరించానని స్పష్టం చేశారు.
వివాహానికి ముందు నమ్రత బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరిగా పేరుగాంచారు. 1993లో 'మిస్ ఇండియా యూనివర్స్' కిరీటాన్ని గెలుచుకున్న ఆమె, 'వాస్తవ్', 'పుకార్', 'కచ్చే ధాగే', 'ఎల్ఓసీ కార్గిల్' వంటి ఎన్నో విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించారు. తెలుగులో ‘వంశీ’ సినిమాతో పాటు కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ ఆమె తన నటనతో మెప్పించారు.