ఏపీలో రానున్న 5 రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- ఏపీకి వర్ష సూచన
- కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు
- ఆదివారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
- సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులకు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఆదివారం (జులై 19) పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు, బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, పెద్ద హోర్డింగుల సమీపంలో నిలబడటం సురక్షితం కాదని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని కోరారు.