2024లో రాజకీయ చెత్తను ప్రజలే శుభ్రం చేశారు: గుడివాడలో చంద్రబాబు
- రాష్ట్రవ్యాప్తంగా రూ.15,274 కోట్ల పట్టణాభివృద్ధి పనులకు గుడివాడ నుంచి శ్రీకారం
- బూతులు తిట్టిన వారి నోళ్లను ప్రజలు తమ ఓట్లతో కడిగేశారన్న చంద్రబాబు
- అక్టోబర్ 2 నాటికి ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటన
- భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అసభ్య పోస్టులను సహించేది లేదని హెచ్చరిక
- ఈ నెల 22 నుంచి "తల్లికి వందనం" కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ
పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని రాజకీయ చెత్తను ప్రజలే శుభ్రం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బూతులు తిట్టిన వారి నోళ్లను ప్రజలు తమ ఓట్లతో కడిగేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం జరిగిన 18వ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 120 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రూ.15,274 కోట్ల విలువైన ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజినీరింగ్ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రాన్ని కాలుష్య రహిత, చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
స్వచ్ఛ రాజకీయాల కోసమే ఎన్టీఆర్ పార్టీ స్థాపన
దివంగత ఎన్టీఆర్ తొలిసారి ప్రజాక్షేత్రంలో నిలిచిన గుడివాడ నుంచే స్వచ్ఛ రాజకీయాలకు పునాది పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన ప్రజాప్రతినిధులు, తెలుగువారి ఆత్మగౌరవం అనే లక్ష్యాలతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. గతంలో ఉన్న స్వార్థ రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధి, సంక్షేమానికి ఆయన శ్రీకారం చుట్టారని అన్నారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి, సంపద సృష్టి లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు ఊడ్చడం కాదని, పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటమే అసలు లక్ష్యమని వివరించారు.
అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత రాష్ట్రం
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 140 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిని తొలగించి ఇప్పుడు స్వచ్ఛ పథం, ఆపరేషన్ క్లీన్ స్వీప్ వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని శుభ్రం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రాన్ని చెత్త రహితంగా మారుస్తామని ప్రకటించారు. దీనికోసం రూ.528 కోట్లతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 8 ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇంటింటికీ చెత్త సేకరణ కోసం 126 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించామని, త్వరలో మరో 1104 ఇ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే తడి, పొడి చెత్తను వేరుచేయాలని, 'నెట్ జీరో' వ్యర్థాల విధానాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తప్పు ఎవరు చేసినా ఉపేక్షించం
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి లేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లో క్రిమినల్ ధోరణులు, కుట్రలు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టి, ప్రశ్నిస్తే భావ ప్రకటనా స్వేచ్ఛ అనడం దారుణమన్నారు.
ప్రజల జీవితాలకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని, తప్పు చేసిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గుంటూరులో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన టీడీపీ కార్యకర్తను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించామని, శ్రీకాకుళం ఘటనలోనూ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా, పేదల పక్షాన నిలిచే మనసుందని అన్నారు. ఈ నెల 22 నుంచి 24 మధ్య "తల్లికి వందనం" పథకం కింద 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,122 కోట్లు జమ చేయనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, 12 ఏళ్ల క్రితం నీళ్లు లేక ఇబ్బంది పడిన కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా 450 టీఎంసీల గోదావరి జలాలను అందించి రూ.50 వేల కోట్ల సంపద సృష్టించామని గుర్తుచేశారు. అక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందిస్తూ ఆదుకుంటున్నామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గుడివాడ బస్టాండ్ అభివృద్ధికి అన్నే నరసింహారావు దంపతులు రూ.3 కోట్లు విరాళం ప్రకటించారు. సాయి శ్వేత అనే గృహిణి అమరావతి కోసం తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. వారిని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.