తరచూ ‘సారీ’ చెబుతున్నారా? దీని వెనక కారణం ఇదే అంటున్న సైకాలజిస్ట్‌లు
- సాధారణంగా సారీ చెప్పడం అంటే జరిగిన తప్పును ఒప్పుకోవడం
- లేదా ఎదుటివారికి కలిగిన ఇబ్బందికి బాధ్యత తీసుకోవడం
- కొందరు మాత్రం తమ తప్పు లేకపోయినా తరచూ క్షమాపణలు
- అసౌకర్యకరమైన పరిస్థితులను తప్పించుకోవాలనే మనస్తత్వమే కారణమన్న నిపుణులు
- ఒత్తిడి, అందరినీ సంతోషపెట్టాలనే తపన కూడా అయ్యుండొచ్చని వివరణ
ఎవరైనా మిమ్మల్ని ఢీకొన్నా ‘సారీ’.. మీటింగ్‌లో ఓ ప్రశ్న అడిగినా ‘సారీ’.. ఎదుటివారి మూడ్ బాగోలేకపోయినా ‘సారీ’.. ఇలా ప్రతిదానికీ క్షమాపణలు చెప్పే అలవాటు మీకూ ఉందా? అయితే అది కేవలం మర్యాద మాత్రమే కాదని, దాని వెనుక కొన్ని మానసిక కారణాలు దాగి ఉండొచ్చని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.
ఇండియా టుడే కథనం ప్రకారం... సాధారణంగా ‘సారీ’ అంటే మన వల్ల జరిగిన తప్పును అంగీకరించడం లేదా ఎదుటివారికి కలిగిన ఇబ్బందికి బాధ్యత తీసుకోవడం. కానీ కొందరు మాత్రం తమ తప్పు లేకపోయినా తరచూ క్షమాపణలు చెబుతుంటారు. దీనికి కారణం.. ఒక పరిస్థితి ఎంత తీవ్రమైందో వారు ఇతరుల కంటే ఎక్కువగా భావించడం కావచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. చిన్న విషయాన్నే పెద్ద తప్పుగా భావించి వెంటనే ‘సారీ’ చెప్పేస్తుంటారు.
మరో కారణం గొడవలు, అసౌకర్యకరమైన పరిస్థితులను తప్పించుకోవాలనే మనస్తత్వం. కొందరికి ‘సారీ’ అనేది తప్పు ఒప్పుకోవడం కంటే, ఎదుటివారితో ఉద్రిక్తత పెరగకుండా చూసుకునే మార్గంగా మారిపోతుంది. అంటే, ‘నా వల్ల తప్పు జరిగింది’ అనే అర్థం కంటే.. ‘ఈ పరిస్థితి ఇంకాస్త అసౌకర్యంగా మారకూడదు’ అనే భావన ఎక్కువగా పనిచేస్తుంది.
ఇలా పదే పదే ‘సారీ’ చెప్పడం కాలక్రమేణా అలవాటుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. నిజంగా క్షమాపణ అవసరమా? కాదా? అని ఆలోచించేలోపే ఆ పదం నోటివెంట వచ్చేస్తుంది. అందుకే రోజుకు ఎక్కువ సార్లు ‘సారీ’ చెప్పే వారు మరీ ఎక్కువ మర్యాదస్తులు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒత్తిడి, అందరినీ సంతోషపెట్టాలనే తపన లేదా వివాదాలను దూరంగా ఉంచాలనే మనస్తత్వం కూడా దీనికి కారణం కావచ్చు.
కాబట్టి, ఇకపై ‘సారీ’ చెప్పే ముందు.. నిజంగా క్షమాపణ అవసరమా? లేక అది కేవలం అలవాటా? అని ఒక్కసారి ఆలోచించమని సైకాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.