రష్మిక మందన్న సక్సెస్‌కు అదే కారణం.. బృందా మాస్టర్ ప్రశంసలు
- మైసా చిత్రంలో నటిస్తున్న రష్మిక మందన్న
- ఈ సినిమాలో ఓ పాట కొరియోగ్రాఫ్ చేస్తున్న బృందా మాస్టర్
- రష్మిక కష్టం, ప్రిపరేషన్ అద్భుతమని ప్రశంస
- అంకితభావమే ఆమె విజయానికి కారణమన్న మాస్టర్
- ఎంత నొప్పితో ఉన్నా ఫోకస్ మాత్రం తగ్గదని వెల్లడి
- ఇలాంటి హీరోయిన్లు అరుదుగా ఉంటారని ప్రశంస
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అంకితభావమే ఆమె విజయానికి ప్రధాన కారణమని ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ప్రశంసించారు. ప్రస్తుతం దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ‘మైసా’ చిత్రంలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న ఆమె.. రష్మిక పనితీరుపై సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేశారు.
‘‘రిహార్సల్స్ నుంచి షూటింగ్ వరకు నువ్వు పడిన కష్టం, ప్రిపరేషన్ అద్భుతం. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఇంత క్రమశిక్షణ, అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న హీరోయిన్‌ను చాలా అరుదుగా చూశాను. నేను చెప్పిన ప్రతి కరెక్షన్‌ను చిరునవ్వుతో స్వీకరించి వెంటనే అమలు చేశావు. నొప్పిలో ఉన్నా నీ ఫోకస్ ఏమాత్రం తగ్గదు. ఈ సినిమా కోసం నువ్వు చేసిన శ్రమ ప్రేక్షకులకు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది’’ అంటూ బృందా మాస్టర్ రాసుకొచ్చారు.
‘మైసా’ చిత్రంలో రష్మిక ఓ గోండ్ గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. భావోద్వేగాలతో పాటు శారీరకంగా కూడా సవాల్ విసిరే ఈ పాత్రపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం జేక్స్ బిజోయ్ అందిస్తుండగా, అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు.