టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం.. ఉప ఎన్నికలకు సిద్ధం

Tollywood Dance Directors Association sensational decision ready for by-elections
  • ఫెడరేషన్ జోక్యాన్ని ఖండించిన టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్
  • ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన అసోసియేషన్
  • జులై 20న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని వెల్లడి
టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDDA) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేసిన అసోసియేషన్, ఖాళీ అయిన పోస్టులకు ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ సభ్యుల డిమాండ్ మేరకు ఉప ఎన్నికలకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను జులై 20న నామినేషన్లు దాఖలు స్వీకరించడంతో ప్రారంభించనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ఎన్నికల అధికారి అదే రోజు నుంచి నామినేషన్ల పరిశీలన చేయనున్నట్లు తెలిపింది. జులై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

ఎన్నికల నిబంధనల ప్రకారమే ఈ ఎలక్షన్స్ జరుగుతాయని అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్‌లో ఇటీవల జరిగిన వివాదం నేపథ్యంలో 10 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. మిగిలిన ఆరుగురు కూడా ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది. 

Advertisement
TFDDA
Tollywood Dance Directors Association
Telugu Film Industry elections
TFDDA by elections
Tollywood choreography news
Film Federation controversy

More Telugu News