రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

BRS leaders file police complaints against Revanth Reddy
  • కేసీఆర్, కేటీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు
  • షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన నేతలు
  • సీఎంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమ ఫిర్యాదుల్లో వారు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ శ్రేణులు షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. 

బీఆర్ఎస్ నాయకుల రక్తం పంటలపై చల్లితే అవే పండుతాయని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత 2023 కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన సీఎంపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు కోరారు. ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Revanth Reddy
BRS Leaders
Telangana Politics
Shadnagar Police Station
KCR KTR Harish Rao
Bharatiya Nyaya Sanhita

More Telugu News