జగన్ హయాంలో 275 మంది మత్స్యకారులు మృతి చెందారు: అచ్చెన్నాయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ హయాంలో 275 మంది మత్స్యకారులు మృతి చెందారు: అచ్చెన్నాయుడు

Atchannaidu says 275 fishermen died during Jagan tenure
  • వైసీపీ పాలనలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదన్న అచ్చెన్నాయుడు
  • గొడ్డలి పార్టీ అబద్ధాల పునాదులపై పుట్టిందని ఎద్దేవా
  • మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్య
మత్స్యకారులను పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని అన్నారు. వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాల వల్ల 275 మంది మృతి చెందారని తెలిపారు. అయితే, వారిని జగనే చంపేశారని అవివేకంగా తాము మాట్లాడబోమన్నారు. నాడు మృతి చెందిన 275 మంది కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

గొడ్డలి పార్టీ అబద్ధాల పునాదులపై పుట్టిందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. సీదిరి అప్పలరాజు కుమారుడు ఓ వ్యక్తిని తన వాహనంతో ఢీకొట్టి చంపినా వైద్యం చేయించకపోవడం దారుణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుందని, ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జగన్ చేసే చౌకబారు వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని అన్నారు.
Advertisement
Atchannaidu
Jagan Mohan Reddy
Andhra Pradesh Fishermen
YSRCP
Fisherman Deaths AP
Seediri Appalaraju

More Telugu News