బీచ్‌లోనే విమానం ల్యాండింగ్.. ప్రపంచంలోనే ఏకైక ఎయిర్‌పోర్ట్!
- స్కాట్లాండ్‌లో ప్రపంచంలోనే ప్రత్యేకమైన బారా విమానాశ్రయం
- బీచ్ ఇసుకపైనే విమానాల ల్యాండింగ్, టేకాఫ్
- సముద్రపు ఆటుపోట్ల ఆధారంగా నడిచే విమాన సర్వీసులు
- రోజుకు రెండుసార్లు నీటిలో పూర్తిగా మునిగిపోయే రన్‌వే
- ఏవియేషన్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్న వింత ఎయిర్‌పోర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమానాశ్రయాలు ఉన్నప్పటికీ, సముద్ర తీరంలో విమానాలు ల్యాండ్ అయ్యే ఏకైక ఎయిర్‌పోర్ట్ స్కాట్లాండ్‌లోని 'బారా' ద్వీపంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఇక్కడ విమానాల రాకపోకలను కేవలం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే కాకుండా, సముద్రపు ఆటుపోట్లు కూడా శాసిస్తాయి.
బారా విమానాశ్రయంలో రన్‌వే అంటే సాధారణంగా ఉండే కాంక్రీట్ నిర్మాణం కాదు, విశాలమైన ఇసుక తీరమే ఇక్కడ రన్ వేగా మారుతుంది. దీనిని 'ట్రాయ్ మోర్' లేదా 'కాకిల్ స్ట్రాండ్' అని కూడా పిలుస్తారు. సముద్రపు పోటు తగ్గి నీరు వెనక్కి వెళ్ళినప్పుడు గట్టిపడిన ఇసుక నేలపై విమానాలు ల్యాండ్ అవుతాయి. అదే ఆటు (హై టైడ్) సమయంలో ఈ రన్‌వే మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఫలితంగా ఆ సమయంలో విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, నీరు తగ్గాక తిరిగి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
'లోగాన్ ఎయిర్' అనే సంస్థ గ్లాస్గో నుంచి బారాకు షెడ్యూల్డ్ విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ప్రయాణికులకు నీలి సముద్రం, తెల్లటి ఇసుక తిన్నెలతో కూడిన అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. విమానాల రాకపోకలు లేని సమయంలో ఈ బీచ్ పర్యాటకులకు విహార కేంద్రంగా, నడకకు మరియు ఇతర వినోద కార్యక్రమాలకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేకతల వల్లే ఏవియేషన్ ప్రియులు, సాహస యాత్రికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో బారా ఎయిర్‌పోర్టు చోటు సంపాదించుకుంది.
ఈ ద్వీపంలో చారిత్రక కిసిముల్ కోట, మనోహరమైన తీర ప్రాంతాలు, సాంప్రదాయ గ్రామాలు వంటి పర్యాటక ఆకర్షణలు మరెన్నో ఉన్నాయి. మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలం ఇక్కడి సందర్శనకు అత్యంత అనుకూలమైన సమయం. విమాన మార్గంతో పాటు ఫెర్రీ ద్వారా కూడా ఈ ద్వీపానికి చేరుకోవచ్చు.