ఏడేళ్ల తర్వాత మోదీని గుర్తు చేసుకున్న బేర్‌ గ్రిల్స్‌.. ఏమన్నారంటే!

Bear Grylls remembers PM Modi after seven years and shares his views
  • మోదీపై బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసలు
  • ఎక్స్‌లో ఫొటోలు పంచుకున్న గ్రిల్స్‌
  • ‘‘అత్యుత్తమ నేతలు ఆర్భాటంగా ఉండరు’’ అని వ్యాఖ్య
  • 2019 ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ఎపిసోడ్‌ను గుర్తు చేసిన గ్రిల్స్‌
  • జిమ్‌ కార్బెట్‌ పార్కులో చిత్రీకరణ
  • గ్రిల్స్‌ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌
బ్రిటిష్‌ సాహస యాత్రికుడు, టెలివిజన్‌ వ్యాఖ్యాత బేర్‌ గ్రిల్స్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో తాను కలిసిన అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో మోదీ కూడా ఒకరని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బ్రిటన్‌ యువరాజు విలియమ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో కొందరిని కలిశాను. అత్యుత్తమ నాయకులు ఎప్పుడూ ఆర్భాటంగా ఉండరని తెలిసింది’’ అంటూ బేర్‌ గ్రిల్స్‌ పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

2019లో ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ప్రత్యేక ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమైన ఆ కార్యక్రమంలో ఇద్దరూ అడవిలో ప్రయాణిస్తూ పర్యావరణ పరిరక్షణపై చర్చించారు. చిన్నతనంలో హిమాలయ ప్రాంతంలో గడిపిన రోజులు ప్రకృతితో కలిసి జీవించడం నేర్పాయని మోదీ అప్పట్లో చెప్పారు.
Advertisement
Narendra Modi
Bear Grylls
Man vs Wild
Barack Obama
Jim Corbett National Park
Discovery Channel

More Telugu News