బండ్ల గణేశ్ కుమార్తె వివాహం... ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ఆహ్వానం

Bandla Ganesh invites Nara Lokesh for daughter Janani marriage ceremony
  • ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్
  • ఆగస్టు 16న జరగనున్న తన కుమార్తె వివాహానికి ఆహ్వానం
  • లోకేష్‌ను 'నెక్స్ట్ జనరేషన్ లీడర్' అంటూ కొనియాడిన బండ్ల
  • సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న నిర్మాత
  • వైరల్ అవుతున్న బండ్ల గణేష్ పోస్ట్
ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు 16న జరగనున్న తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ విషయాన్ని బండ్ల గణేశ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "తెలుగుదేశం పార్టీ అగ్రనేత, యువతకు కాబోయే నాయకుడు (నెక్స్ట్ జనరేషన్ లీడర్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ గారిని కలవడం జరిగింది. మా కుమార్తె వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా వారిని ఆహ్వానించాను" అని తన పోస్టులో పేర్కొన్నారు.

 ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో ఆగస్టు 16న జరగనుంది. గత మే 3వ తేదీన వీరి నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరిగింది. 
Advertisement
Bandla Ganesh
Nara Lokesh
Bandla Ganesh daughter wedding
Janani marriage invitation
AP IT Minister
Telugu cinema producer

More Telugu News