పల్నాడులో తీవ్ర విషాదం: ఇద్దరు కుమారులను చంపి, తల్లి ఆత్మహత్య
- పల్నాడు జిల్లాలో తల్లి, ఇద్దరు పిల్లల మృతి
- ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం
- వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన
- కుటుంబ కలహాలే కారణమా అని పోలీసుల దర్యాప్తు
- మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు బిడ్డలను కడతేర్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన వినుకొండ మండలం విఠరాజుపల్లి గ్రామంలో వెలుగుచూసింది. ఈ ఘోరకలియంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విఠంరాజుపల్లికి చెందిన నక్కా భారతి (24)కు పాల వ్యాన్ డ్రైవర్ సునీల్ రెడ్డితో సుమారు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి తేజేష్ రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త చెడు వ్యసనాలకు బానిస అవడ్డంతో కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో సునీల్ రెడ్డి సోమవారం రాత్రి విధులకు వెళ్లిన తర్వాత భారతి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి చంపింది. అనంతం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి తెలియగానే గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో కన్నీటి పర్యంతమైంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఈ దారుణానికి దారితీశాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.