వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు 14 రోజుల రిమాండ్

YSRCP leader Nagarjuna Yadav sent to 14 days remand
  • సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేతకు రిమాండ్
  • నాగార్జున యాదవ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • 'డెలివరీ బాయ్' అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
  • గుంటూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలింపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అంతకుముందు తెలంగాణ పోలీసులు ఏపీలోని గుంటూరులో ఉన్న ఆయన నివాసంలో నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని 'స్విగ్గీ లేదా జొమాటో డెలివరీ బాయ్' అని, దేశంలోనే అత్యంత దురదృష్టకరమైన డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా సీఎం సరిగ్గా చదవలేరని ఆరోపించారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో నాగార్జున యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.  

ఈ వ్యాఖ్యలు శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కైలాష్ సజ్జన్ బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఏపీ పోలీసుల సహకారంతో నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేశారు.
Advertisement
Nagarjuna Yadav
Revanth Reddy
YSRCP leader arrested
Telangana CM derogatory comments
Nampally Court remand
Chanchalguda Jail

More Telugu News