సూర్యుడినే ‘డిమ్’ చేస్తే.. ఎల్‌నినోతో పోరుకు శాస్త్రవేత్తల కొత్త వ్యూహం!
- ఎల్‌నినో ప్రభావం తగ్గించే కొత్త ప్రతిపాదన
- మేఘాలను ప్రకాశవంతం చేయాలని సూచన
- సూర్యకిరణాలను అంతరిక్షంలోకి మళ్లించే యోచన
- కంప్యూటర్ అధ్యయనంలో ఆశాజనక ఫలితాలు
- దుష్ప్రభావాలపై శాస్త్రవేత్తల ఆందోళన
- ప్రస్తుతం ప్రయోగాత్మక అమలుకు లేని ప్రణాళిక
వర్షాలు, కరవు, భానుడి భగభగలు.. ఎల్‌నినో వస్తే ప్రపంచ వాతావరణమే మారిపోతుంది. ఇలాంటి తీవ్ర ప్రభావాలను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. సూర్యకాంతి భూమిపైకి తక్కువగా చేరేలా మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చగలిగితే ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది.
ఏంటీ ఈ కొత్త ప్రతిపాదన?
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగో పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం నిర్వహించారు. ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో సోలార్ జియో ఇంజినీరింగ్‌ను ప్రత్యామ్నాయంగా సూచించారు. సూర్యకాంతి వాతావరణంతో పరస్పర చర్యను మార్చడం ద్వారా తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించే అవకాశాలను ఇందులో పరిశీలించారు.
మేఘాలే కవచంగా మారితే..
ఈ ప్రతిపాదన ప్రకారం భూమి ఎగువ వాతావరణ పొరలో ప్రత్యేక ‘ఏరోసాల్స్’ను విడుదల చేయాలి. దీంతో సముద్రాలపై ఏర్పడే మేఘాలు మరింత ప్రకాశవంతంగా మారతాయి. అవి సూర్యకిరణాలను తిరిగి అంతరిక్షంలోకి ప్రతిఫలింపజేస్తాయి. ఫలితంగా భూమి ఉపరితలం కొంత చల్లబడే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానాన్ని ‘మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్’గా పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావం తగ్గుతుందా?
పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడమే సూపర్ ఎల్‌నినోకు ప్రధాన కారణం. దీని వల్ల కరవు, భారీ వర్షాలు, వడగాలుల వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 1997, 2015లో నమోదైన ఎల్‌నినో పరిస్థితులను ఆధారంగా చేసుకొని నిర్వహించిన కంప్యూటర్ అనుకరణల్లో ఈ విధానం చల్లదనాన్ని, పొడిబారే ప్రభావాన్ని దాదాపు 40 శాతం పెంచగలదని గుర్తించారు.
ఆందోళనలూ ఉన్నాయి
అయితే ఈ విధానంపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనం పొందాలంటే ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాల్సి రావచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే చర్యల నుంచి దృష్టి మళ్లే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో ఇప్పటికీ పూర్తిగా తెలియలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దీనిని క్షేత్రస్థాయిలో అమలు చేసే ప్రణాళిక ఏదీ లేకపోయినా, పెరుగుతున్న వాతావరణ ముప్పు దృష్ట్యా ఇలాంటి ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు అవసరమని అధ్యయన బృందం అభిప్రాయపడింది.