కెమెరా ముందు డ్రెస్ మార్చాలా?.. హద్దుల్లో ఉండండి: ఫొటోగ్రాఫర్లకు జరీన్ ఖాన్ వార్నింగ్!
- స్టోర్ లాంచ్‌లో అసభ్యకర కామెంట్‌పై నటి జరీన్ ఖాన్ ఆగ్రహం
- కెమెరా ముందే బట్టలు ట్రై చేయాలన్న ఫొటోగ్రాఫర్‌కు బుద్ధి చెప్పిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జరీన్ హెచ్చరికల వీడియో
- హద్దులు దాటుతున్న పాపరాజీల తీరుపై నెటిజన్ల తీవ్ర విమర్శలు
- గతంలో పాపరాజీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేహా ధూపియా
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ముంబైలోని ఓ దుకాణం ప్రారంభోత్సవంలో పాపరాజీల (ఫొటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన పరిధులు దాటి అసభ్యకరంగా మాట్లాడిన ఒక ఫొటోగ్రాఫర్‌ను ఆమె అక్కడికక్కడే నిలదీసి గట్టిగా మందలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని ఆమె స్పష్టం చేసిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'మీ ముందు డ్రెస్ మార్చుకోవాలా?'
ఈవెంట్‌లో భాగంగా జరీన్ ఖాన్ ఒక జీన్స్ అవుట్‌ఫిట్‌ను చేతితో పట్టుకుని కెమెరాలకు పోజులిస్తున్నారు. ఆ సమయంలో అక్కడున్న ఒక ఫొటోగ్రాఫర్.. "ఆ బట్టలను ఒకసారి ఇక్కడే వేసుకుని చూపించవచ్చు కదా" అని వ్యాఖ్యానించాడు. దాంతో తీవ్రంగా కలత చెందిన జరీన్.. "మీ అందరి ముందా? అది అస్సలు కుదరదు" అంటూ తీవ్రంగా స్పందించారు.
అంతటితో ఆగకుండా, "నాతో ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి, నేను పడే రకాన్ని కాను. అందరూ మీ హద్దుల్లో ఉండండి" అంటూ హిందీలో గట్టిగా హెచ్చరించారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను గౌరవించకుండా, వృత్తిపరమైన హద్దులు దాటి ప్రవర్తించే వారికి ఇలాంటి బుద్ధి చెప్పడమే సరైన నిర్ణయమని నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
హద్దులు మీరుతున్న పాపరాజీల శైలి
సెలబ్రిటీల విషయంలో పాపరాజీలు పరిధులు దాటడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ప్రముఖ నటి నేహా ధూపియా కూడా ముంబైలోని ఓ కార్యక్రమంలో ఇదే తరహాలో మండిపడ్డారు. నటీమణుల వెనుక వైపు నుంచి (బ్యాక్ షాట్స్) అభ్యంతరకరంగా ఫొటోలు తీయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఫొటోగ్రాఫర్లు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరీన్ ఖాన్ ఘటనతో సెలబ్రిటీల ప్రైవసీ, భద్రత అంశాలపై బాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది.