ఇరాన్‌లోని మరో అణు కేంద్రంపై దాడికి ట్రంప్‌ సంకేతాలు!

Donald Trump warns of strike on Iran Pickaxe Mountain nuclear site
  • పిక్‌యాక్స్‌ కేంద్రం లక్ష్యాల జాబితాలో ఉందన్న ట్రంప్‌
  • ఆ కేంద్రంపై నిరంతరం నిఘా కొనసాగుతోందని వెల్లడి
  • ఇరాన్‌ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపణ
  • ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వబోమని స్పష్టం
  • ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వ్యాఖ్య
  • ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగుతుందని సంకేతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ‘పిక్‌యాక్స్‌ మౌంటెన్‌’ అణు కేంద్రం అమెరికా లక్ష్యాల జాబితాలోనే ఉందని చెప్పారు. ఆ కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. అవసరమైతే త్వరలోనే అక్కడ కూడా దాడి జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.

స్పేస్‌ ఫోర్స్‌తో పాటు ఇతర వ్యవస్థల ద్వారా ఆ కేంద్రంపై నిరంతరం నిఘా కొనసాగుతోందని ట్రంప్‌ వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి కదలికలు కనిపించడం లేదని చెప్పారు. ఇరాన్‌ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారం వచ్చినప్పుడల్లా దాన్ని అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో.. ఆ దేశమే వెనక్కి తగ్గిందని ట్రంప్‌ ఆరోపించారు. ఒప్పందాలను ఉల్లంఘించడం ఇరాన్‌కు అలవాటేనని విమర్శించారు. ఇరాన్‌ నాయకత్వంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి చేతికి అణ్వాయుధం దక్కితే దాన్ని వినియోగించడానికి ఏమాత్రం వెనుకాడరని ఆరోపించారు. అయితే ఆ దేశ నాయకులపై తీసుకునే చర్యల గురించి మాత్రం మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

వైట్‌హౌస్‌లో జరిగిన మరో కార్యక్రమంలో కూడా ట్రంప్‌ ఇదే అంశంపై స్పందించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వబోమని స్పష్టం చేశారు. మరోవైపు చర్చలకు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Advertisement
Donald Trump
Iran nuclear site
Pickaxe Mountain
US Iran tensions
Iran nuclear program
Space Force surveillance

More Telugu News