‘నా పెళ్లి.. మా అమ్మ ప్లాన్ చేసింది’.. పెళ్లి వద్దంటూ గుండు కొట్టించుకున్న యువతి.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్

Keerthana Menon shaves head to protest marriage planned by her mother
  • ఇన్‌స్టాగ్రామ్‌లో 'కీర్తన మీనన్' షేర్ చేసిన గుండు వీడియో
  • అమ్మ పెళ్లి ప్లాన్ చేసిందంటూ క్యాప్షన్ పెట్టడంతో సంచలనం
  • నిరసనా, క్యాన్సర్ చారిటీయా లేక కేవలం ప్రచారమా? అనే సస్పెన్స్
  • వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతీక అంటూ ప్రశంసలు, ఆందోళనలు
సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఒక యువతి పెళ్లి పీటలు ఎక్కడానికి ఇష్టం లేక ఏకంగా గుండు కొట్టించుకుందంటూ  ఒక వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కీర్తన మీనన్ అనే యువతి షేర్ చేసిన ఈ వీడియోను చూసి కొందరు ముక్కున వేలేసుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. కీర్తన మీనన్ ప్రశాంతంగా కూర్చుని ఉండగా బార్బర్ ఆమె జుట్టును పూర్తిగా గుండుగా మారుస్తుంటాడు. ఈ దృశ్యానికి కీర్తన పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. "పివోవి (పాయింట్ ఆఫ్ వ్యూ): మా అమ్మ నా పెళ్లి ప్లాన్ చేసింది" అంటూ ఆమె ఆ వీడియో కింద రాసుకొచ్చింది. ఆ వీడియోలో ఆమె ఎక్కడా బాధపడుతున్నట్లు గానీ, కంగారుపడుతున్నట్లు గానీ కనిపించలేదు. ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా చాలా ప్రశాంతంగా గుండు చేయించుకుంది.

పెళ్లిపై నిరసనా?.. కేవలం కంటెంటా?
భారతీయ సమాజంలో ఇప్పటికీ పెద్దలు కుదిర్చిన వివాహాలు సాధారణ విషయమే. అయితే ఈ కాలపు అమ్మాయిలు తమ పెళ్లి విషయాల్లో, భాగస్వామిని ఎంచుకునే విషయంలో సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కీర్తన పెట్టిన క్యాప్షన్ చూసి చాలా మంది ఇది బలవంతపు పెళ్లికి వ్యతిరేకంగా ఆమె తెలిపిన నిరసన అని భావిస్తున్నారు. కానీ, ఆమె ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఎక్కడా స్పష్టం చేయలేదు. ఇది నిజంగానే పెళ్లి చూపులు తప్పించుకోవడానికి చేసిన పనా? లేక తిరుపతి వంటి దేవాలయాల్లో మొక్కులు తీర్చుకోవడమా? క్యాన్సర్ రోగుల కోసం జుట్టును దానం చేసే చారిటీ కార్యక్రమమా? లేదా కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం క్రియేట్ చేసిన వీడియోనా? అనే విషయాలపై స్పష్టత లేదు.

నెటిజన్ల మధ్య పోటాపోటీ చర్చలు
కారణం ఏదైనా ఈ వీడియో మాత్రం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. "ఆధునిక సమస్యలకు ఇలాంటి లెజెండరీ పరిష్కారాలే కావాలి" అని ఒకరు కామెంట్ చేయగా, "నీ ధైర్యానికి జోహార్లు సోదరి" అంటూ మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే, అసలు విషయం ఏంటో తెలియకుండా ఇంత తొందరగా ఒక ముగింపునకు రావడం సరికాదని, సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాకపోవచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా కీర్తన మీనన్ గుండు వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
Advertisement
Keerthana Menon
Viral head shave video
Arranged marriage protest
Keerthana Menon Instagram
Social media debate
Forced marriage protest

More Telugu News