గడియారం ప్రకటనల్లో 10:10 మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనుక సైకాలజీ ఇదే
- అందంగా కనిపించేలా ఉండటమే ప్రధాన కారణం
- బ్రాండ్ లోగో స్పష్టంగా కనిపిస్తుంది
- 10:10 ‘నవ్వు’ ఆకారంలా కనిపిస్తుందని నిపుణుల అభిప్రాయం
- డేట్ విండో, ఇతర డిజైన్‌లు కూడా కనిపిస్తాయి
- ఇప్పుడు ఇది వాచ్ పరిశ్రమలో సంప్రదాయంగా మారింది
వాచ్‌లు, గడియారాల ప్రకటనలు చూసినప్పుడు ఒక విషయం చాలా మందికి కనిపించి ఉంటుంది. దాదాపు అన్ని ప్రకటనల్లోనూ గడియారం 10:10 సమయాన్నే చూపిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా పెట్టింది కాదు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాచ్ కంపెనీలు అనుసరిస్తున్న తెలివైన మార్కెటింగ్ వ్యూహమిది.
10:10 సమయంలో గంటలు, నిమిషాల ముళ్లు ‘V’ ఆకారంలో కనిపిస్తాయి. దీంతో గడియారం బ్యాలెన్స్‌డ్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాదు.. బ్రాండ్ లోగో లేదా డయల్‌పై ఉన్న నంబర్లను ముల్లులు కప్పివేయవు. దీంతో వాచ్ డిజైన్ మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం 10:10 ఆకారం చిరునవ్వును పోలి ఉండటం వల్ల వినియోగదారులపై సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
అలాగే చాలా వాచ్‌లలో ఉండే డేట్ విండో, చిన్న డయల్స్ వంటి ఫీచర్లు కూడా ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో కొన్ని కంపెనీలు 8:20 వంటి సమయాలను ఉపయోగించినా.. 10:10 మరింత అందంగా కనిపించడంతో అదే పరిశ్రమలో ప్రామాణికంగా మారింది. అందుకే నేడు మ్యాగజైన్‌లు, హోర్డింగ్‌లు, ఆన్‌లైన్ ప్రకటనలు, షోరూమ్‌ల్లోని వాచ్‌లలో కూడా ఎక్కువగా 10:10 సమయమే కనిపిస్తోంది.