విజువల్ వండర్‌గా ‘అగధ’.. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

Agadha A Visual Wonder Grand Global Release On August 14
  • దర్శకుడు ఎం.ఎస్. రాజు మిస్టిక్ థ్రిల్లర్ 'అగధ'
  • ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
  • టీజర్‌కు విశేష స్పందన.. 14 మిలియన్ల వ్యూస్
  • విజువల్ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్టు వెల్లడి
  • ప్రధాన పాత్రల్లో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ 'అగధ'. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన 'అగధ' టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. గ్రాండ్ విజువల్స్, ఆసక్తి రేకెత్తించే నేపథ్య సంగీతం, మిస్టీరియస్ వాతావరణంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ టీజర్‌కు 14 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, "'అగధ' నా కలల ప్రాజెక్ట్. టీజర్‌లో చూసింది చాలా చిన్న భాగం మాత్రమే. సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాం. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ, మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌లా రూపొందించాం" అని వివరించారు.

నిర్మాత కాశీ విశాలాక్షి మాట్లాడుతూ, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను నిర్మించామని, టీజర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. 'మహాదేవి' పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని నటి కామాక్షి భాస్కర్ల అన్నారు. 'డర్టీ హరి' తర్వాత మళ్లీ ఎం.ఎస్. రాజుతో పనిచేయడం సంతోషంగా ఉందని హీరో శ్రవణ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
Advertisement
Agadha
MS Raju
Kamakshi Bhaskarla
Shravan Reddy
Agadha Release Date
Mystic Divine Thriller

More Telugu News