ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులు.. భారత్‌తో 200 మిలియన్ డాలర్ల డీల్
- ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయించేందుకు భారత్ ఒప్పందం
- సుమారు రూ.1900 కోట్లతో డీల్
- ఫిలిప్పీన్స్, వియత్నాం తర్వాత బ్రహ్మోస్ కొన్న మూడో దేశం ఇండోనేషియా
- ఆస్త్రా క్షిపణులు, సాంకేతిక బదిలీపైనా కీలక ఒప్పందాలు
- భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధి
రక్షణ రంగ ఎగుమతుల్లో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఇండోనేషియాకు సుమారు 200 మిలియన్ డాలర్ల (రూ.1,900 కోట్లు) విలువైన రెండు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్యాటరీలను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ఇరు దేశాల మధ్య జరిగిన పలు కీలక రక్షణ ఒప్పందాల్లో భాగంగా ఈ డీల్ ఖరారైంది.
ఈ ఒప్పందంతో బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన మూడో విదేశీ కస్టమర్‌గా ఇండోనేషియా నిలిచింది. ఇప్పటికే 2022లో ఫిలిప్పీన్స్ మూడు బ్యాటరీల కోసం ఒప్పందం చేసుకోగా, ఈ ఏడాదే వియత్నాం కూడా బ్రహ్మోస్ కొనుగోలుకు అంగీకరించింది. తాజా ఒప్పందంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తన రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.
ఈ డీల్ కేవలం బ్రహ్మోస్ క్షిపణులకే పరిమితం కాలేదు. ఆస్త్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థలు, కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, సముద్ర భద్రత వంటి అంశాలపై కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఇరు దేశాల రక్షణ మంత్రుల సమావేశంలోనే ఈ ఒప్పందాలపై చర్చలు మొదలయ్యాయి.
భారత్‌కు చెందిన డీఆర్‌డీవో, రష్యాకు చెందిన ఎన్పీవో మషినోస్ట్రోయెనియా సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేశాయి. ఇది భారత త్రివిధ దళాల్లోనూ సేవలందిస్తోంది. భారత్ మరో అరడజను దేశాలతో బ్రహ్మోస్ అమ్మకాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
సాధారణంగా ఒక బ్రహ్మోస్ బ్యాటరీలో 4 లాంచర్లు ఉంటాయి. ఒక్కో లాంచర్ పై 3 రెడీ టు ఫైర్ బ్రహ్మోస్ క్షిపణులు ఉంటాయి. ఆ లెక్కన ఒక బ్యాటరీలో మొత్తం 12 క్షిపణులు ఉంటాయి. వీటిని కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు.