విజయ్ 'జన నాయగన్' సెన్సార్ రిపోర్ట్ వార్తలపై నిర్మాణ సంస్థ క్లారిటీ
- 'జన నాయగన్'కు సెన్సార్ ప్రక్రియ పూర్తయిందంటూ ప్రచారం
- ఈ ప్రచారాన్ని నమ్మొద్దన్న నిర్మాతలు
- సెన్సార్ బోర్డు కొన్ని సవరణలు సూచించిందని వెల్లడి
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. జులై 23న విడుదల అని కూడా వార్తలు వ్యాపించాయి. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.
సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను వీక్షించి కొన్ని సవరణలు సూచించారని, ప్రస్తుతం ఆ మార్పులు చేసే పనిలో బృందం బిజీగా ఉందని నిర్మాతలు తెలిపారు. మార్పులు పూర్తి కాగానే రీ-సెన్సార్ కోసం బోర్డుకు పంపుతామని, అన్ని సాంకేతిక పనులు త్వరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, అధికారిక అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాలని కోరారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్రను పోషించింది. విజయ్ చివరి చిత్రం కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.