హిందూ వ్యతిరేక శక్తులకు వైసీపీ సహాయం చేస్తోంది: శ్రీనివాసానంద సరస్వతి
- రావణ్, జడ శ్రవణ్, ప్రకాశ్ రాజ్ లపై శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం
- నిరంతరం హిందువులపై విషం చిమ్ముతున్నారని మండిపాటు
- ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శ
హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఏపీ సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు.
విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రావణ్, జడ శ్రవణ్ కుమార్, ప్రకాశ్ రాజ్ వంటి వ్యక్తులు హిందువులపై నిరంతరం విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. హిందూ ఆరాధ్య దైవాలను అవమానించేలా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్నారని, హిందూ వ్యతిరేక శక్తులందరికీ వైసీపీ న్యాయ సహాయం చేస్తోందని ఆయన విమర్శించారు.
చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని శ్రీనివాసానంద మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు జరిగిన అనియమాలను ఎత్తి చూపినందుకే తమను టార్గెట్ చేస్తున్నారని స్వామీజీ అన్నారు.
ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశంసించారు. ఆలయాల నుంచి వచ్చే నిధులను ఆలయాల అభివృద్ధికి మాత్రమే వాడాలని విజయ్ చేసిన ప్రకటనను సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై ప్లాన్ ప్రకారం దాడులు జరుగుతున్నాయని అన్నారు.