బహ్రెయిన్‌లో సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Telangana man dies after drowning in Bahrain sea
  • మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్‌గా గుర్తింపు
  • ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లి ఏఎంసీ సంస్థలో ఆపరేటర్‌గా ఉద్యోగం
  • సముద్ర తీరంలో ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్
  • శ్రీనివాస్ మృతిపై పనిచేస్తున్న సంస్థ సంతాపం
బహ్రెయిన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ వాసి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది.

వివరాల్లోకి వెళితే.. తోట శ్రీనివాస్ 2019 నవంబర్ నుంచి బహ్రెయిన్‌లోని ఏఎంసీ అనే సంస్థ ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరానికి వెళ్లగా, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు. ఈ సమాచారం అందుకున్న బహ్రెయిన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.

తోట శ్రీనివాస్ మరణం పట్ల ఏఎంసీ సంస్థ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Thota Srinivas
Telangana man drowned Bahrain
Nizamabad man death Bahrain
Durrat Al Bahrain incident
AMC company Bahrain
Gulf news Telangana

More Telugu News