ఖవాజా ఆసిఫ్ కు మతిస్థిమితం తప్పింది: పాక్ మంత్రి వ్యాఖ్యలకు భారత్ కౌంటర్
- మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారంపై పాక్ మంత్రి అనుమానాలు
- పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ను మానసిక రోగిగా అభివర్ణించిన భారత్
- అసూయతోనే పాక్ మంత్రి అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని కౌంటర్
- పర్యావరణ పరిరక్షణకు మోదీ సేవలకు గాను ఈ అవార్డు ప్రదానం
దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. "ఖవాజా ఆసిఫ్‌కు మానసికస్థితి సరిగా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం నేటి పాకిస్థాన్ పరిస్థితికి అద్దం పడుతోంది. ఆయనకు వేరే పనేమీ లేనట్టుంది. అందుకే తనకు ఏమాత్రం అవగాహన లేని విషయాలపై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వ్యక్తికి అసూయ అనేది చాలా ప్రమాదకరం" అని పేర్కొన్నాయి.
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ప్రధాని మోదీకి జూన్ 28న సీషెల్స్ ప్రభుత్వం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' అనే అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ అవార్డుపైనే ఖవాజా ఆసిఫ్ అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ పురస్కారాన్ని పర్యావరణ పరిరక్షణకు కట్టుబడిన అన్ని దేశాలకు అంకితమిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్ వంటి కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
గతంలో కూడా మోదీకి పర్యావరణ సేవలకు గాను పలు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 2018లో ఐక్యరాజ్యసమితి 'ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్' అవార్డును, సియోల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. ఈ ఏడాది మే నెలలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) అత్యున్నత పురస్కారం 'అగ్రికోలా మెడల్'ను కూడా ఆయన అందుకున్నారు.