మూసీ ప్రాజెక్టులో ఎవరికీ అన్యాయం జరగదు: మంత్రి పొంగులేటి
- మూసీ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసం అంశాలపై పొంగులేటి సమీక్ష
- ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశం
- భూములు కోల్పోయే రైతులకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని వెల్లడి
ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని సూచించారు. భూములు కోల్పోయే రైతులకు తగిన పరిహారం, పునరావాసం అందించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరం మరింత అందంగా మారాలని, విస్తృతంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.