సాయికృష్ణ కేసులో కీలక పరిణామం... ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు
- సాయికృష్ణ కేసులో కీలక మలుపు
- ఆటోలో సూర్యారావుపేటలోని ఏసీపీ కార్యాలయానికి వచ్చిన నిందితులు
- పోలీసులు ఎదుట లొంగుబాటు
- త్వరలోనే కేసు ఓ కొలిక్కివచ్చే అవకాశం
వివరాల్లోకి వెళితే, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయానికి అశోక్, జంగం నాని ఓ ఆటోలో వచ్చారు. అనంతరం నేరుగా అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేయగానే... నాని, అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాయికృష్ణ మృతి ఘటనలో వీరిపై కేసులు నమోదు కాగా, అప్పటి నుంచి పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.
ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ కేసులోని ఇతర అంశాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. వారిద్దరూ ఈ కేసులో సీఐ నాగరాజుకు సహకరించినట్టు సిట్ గుర్తించింది.