వీబీ జీ రామ్ జీ పథకంపై కేంద్రానికి అభ్యంతరాలను తెలియజేసిన సీతక్క

Seethakka expressed objections to the Center on VB G Ram G scheme
  • జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సులో పాల్గొన్న సీతక్క
  • కొత్త పథకం ప్రవేశపెడితే మొత్తం ఆర్థిక భారం రాష్ట్రంపైనే పడుతుందని వ్యాఖ్య
  • పీఎం ఆవాస్ యోజన కింద తక్షణమే గృహాలను మంజూరు చేయాలని విన్నపం
వీబీ జీ రామ్ జీ పథకం 60:40 నిధుల విధానంపై తెలంగాణకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని మంత్రి సీతక్క కేంద్రానికి తెలియజేశారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సులో పాల్గొన్న ఆమె... తెలంగాణలో అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి పథకాల వివరాలను కేంద్రానికి వివరించారు.

జులై 2న వీబీ జీ రామ్ జీ పథకం కొనసాగించాలా? లేక కొత్త పథకం తీసుకురావాలా? అనే అంశంపై తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సీతక్క ప్రకటించారు. కొత్త పథకం ప్రవేశపెడితే 100 శాతం ఆర్థిక భారం రాష్ట్రంపైనే పడుతుందని, ఇది సమస్యాత్మకమని కేంద్రానికి తెలియజేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో 100 శాతం వేతనాల విధానం కొనసాగించాలని, మెటీరియల్ కాంపోనెంట్‌కు 75 శాతం కేంద్ర వాటా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

పీఎం ఆవాస్ యోజన కింద గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వద్దనడంతో కేటాయింపులు లేవని... ఆ పథకం కింద తక్షణమే గృహాలు మంజూరు చేయాలని సీతక్క కోరారు. పీఎంజీఎస్‌వై రోడ్లకు అటవీ అనుమతులు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. తెలంగాణలో జల్ సంచార్ విభాగంలో 13 జాతీయ అవార్డులు సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని సీతక్క పేర్కొన్నారు.

Seethakka
VB G Ram G scheme
Telangana Rural Development
MGNREGS funding
PM Awas Yojana Telangana
National Rural Development Conference

More Telugu News