పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే..?
- అవకాశాలు తగ్గి వెనుకబడ్డ పూజా హెగ్డే
- 'ఓజీ 2'లో పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టు సమాచారం
- గతంలో పవన్ సరసన ఛాన్స్ మిస్ అయిన పూజ
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి కొంత కాలంగా అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు ఫిలిం నగర్ టాక్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. పవన్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో వచ్చిన 'ఓజీ' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఓజీ 2' తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పూజ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
గతంలోనే పవన్, పూజా హెగ్డే కాంబినేషన్ సెట్ అవ్వాల్సింది కానీ... కానీ, డేట్స్ సమస్య కారణంగా ఆగిపోయింది. హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, క్రిష్ జాగర్లమూడి ప్రాజెక్ట్‌లలో మొదట పూజా పేరు వినపడినా వర్కవుట్ అవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు ‘ఓజీ 2’ వార్త నిజమైతే... వరుస ఫెయిల్యూర్స్‌తో సైలెంట్ అయిన పూజా హెగ్డేకు, ఈ మెగా ప్రాజెక్ట్ ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ లా మారబోతోంది.