వైద్య పరీక్షల కోసం భార్యతో కలిసి ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్
- రెండు భుజాలకు గాయాలతో బాధపడుతున్న పవన్
- కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేరనున్న డిప్యూటీ సీఎం
- ఆయన వెంట భార్య అన్నా కొణిదెల కూడా ముంబై పయనం
గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రెండు భుజాలకు సంబంధించి ‘రొటేటర్ కఫ్’ గాయంతో బాధపడుతున్నారు. ఈ గాయం కారణంగా ఆయన భుజాల కండరాలు చిట్లినట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ నొప్పితో ఇబ్బంది పడినప్పటికీ, ఆయన తన పర్యటనలను కొనసాగించారు. ప్రస్తుతం ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.
తాను వరుసగా సినిమాలు చేసిన సమయంలో తగిలిన గాయాలు ఇప్పుడు బాధిస్తున్నాయని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇటీవల ఆయనకు సైనస్ శస్త్రచికిత్స కూడా జరిగింది.

