కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి హోండా గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ నెలకుగానూ ప్రముఖ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్‌, పొడిగించిన వారంటీ వంటి ఆఫర్లతో కొనుగోలుదారులు రూ.లక్షల్లో ఆదా చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

ఎలివేట్‌పై అత్యధిక తగ్గింపు
హోండా లైనప్‌లో ప్రస్తుతం అత్యధిక ప్రయోజనాలు ఎలివేట్ ఎస్‌యూవీపైనే ఉన్నాయి. టాప్ వేరియంట్లయిన ఎలివేట్ జెడ్ఎక్స్ ఎంటీ, జెడ్ఎక్స్ సీవీటీ మోడళ్లపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది.
నగదు తగ్గింపులతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. కొన్ని వేరియంట్లకు 360 డిగ్రీల కెమెరా, ప్రీమియం డ్యాష్‌క్యామ్‌, ఇతర యాక్సెసరీ ప్యాకేజీలను ఉచితంగా అందిస్తోంది. ‘ఎలివేట్ వీ అపెక్స్‌’పై రూ.1.61 లక్షల వరకు, వీఎక్స్ వేరియంట్‌పై రూ.1.53 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

అమేజ్‌పై కూడా
కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మంచి ఆదరణ ఉన్న హోండా అమేజ్‌పైనా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్ అయిన అమేజ్ జెడ్ఎక్స్ ఎంటీపై గరిష్ఠంగా రూ.67 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.
అమేజ్ వీఎక్స్ వేరియంట్‌పై రూ.48 వేల వరకు, వీ వేరియంట్‌పై రూ.28 వేల వరకు తగ్గింపు ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లకు అమర్చే సీఎన్‌జీ కిట్‌పై రూ.20 వేల వరకు రీయింబర్స్‌మెంట్‌ను కూడా హోండా అందిస్తోంది.

సిటీ కొనేవారికీ లాభమే
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ హోండా సిటీ సెడాన్‌పై కూడా కంపెనీ భారీ తగ్గింపు ప్రకటించింది. పెట్రోల్ వేరియంట్లపై రూ.1.56 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే ‘సిటీ ఈ:హెచ్‌ఈవీ’ మోడల్‌పై రూ.1.97 లక్షల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో ప్రీమియం సెడాన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారింది.

నగరం, డీలర్‌షిప్‌ను బట్టి ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు సమీప డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.