'పెద్ది' చిత్రానికి కాసుల వర్షం.. ఆరు రోజుల్లోనే అరుదైన రికార్డు
- బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా వసూళ్ల వర్షం
- ఆరు రోజుల్లోనే రూ. 332 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు
- వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
- రామ్ చరణ్ నటనకు ప్రశంసల వెల్లువ
జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్ల వివరాలను నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ భారీ విజయం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ఆయన కెరీర్‌లో ఇదొక గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ, రవికిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించి తమ నటనతో ఆకట్టుకున్నారు.