- ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి బద్ధకమే కారణమన్న రాజమౌళి
- అమ్మాయిని వెతికి, పెద్దలతో మాట్లాడటం ప్రభాస్‌కు పెద్ద పని అని వ్యాఖ్య
- ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడో చెప్పిన జక్కన్న
- నిజమైన అంచనా.. 2020లో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్న రానా
- ప్రభాస్‌కు కత్రినా కైఫ్ జోడీ బాగుంటుందని సూచించిన రానా
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వయసు 47 ఏళ్లకు చేరుకున్నా ఇంకా బ్యాచిలర్‌గానే కొనసాగుతున్నాడు. అతడిపెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభాస్ ఎందుకు వివాహం చేసుకోవడం లేదనేదానిపై దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి గతంలోనే ఒక ఆసక్తికరమైన కారణాన్ని వెల్లడించాడు. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి అతడి బద్ధకమే ప్రధాన కారణమని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
కొన్నేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ షోలో ప్రభాస్, రానా దగ్గుబాటితో కలిసి రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు జక్కన్న బదులిస్తూ "ప్రభాస్ చాలా సిగ్గరి, అంత త్వరగా ఎవరితోనూ కలవడు. ఒక అమ్మాయిని వెతికి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఒప్పించడం లాంటి పనులన్నీ అతనికి చాలా కష్టంగా అనిపిస్తాయి. అందుకే అతను పెళ్లి చేసుకోవడం లేదు" అని వివరించాడు.
అంతేకాదు, అదే షోలో ప్రభాస్ కంటే ముందే రానా దగ్గుబాటి పెళ్లి చేసుకుంటాడని రాజమౌళి జోస్యం చెప్పాడు. ఆయన చెప్పినట్టే, రానా 2020 ఆగస్టు 8న హైదరాబాద్‌కు చెందిన మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో రాజమౌళి అంచనా నిజమైంది.
ఇదే ఎపిసోడ్లో, ప్రభాస్‌కు బాలీవుడ్ నుంచి ఏ హీరోయిన్ను సెట్ చేస్తావని కరణ్ అడగ్గా, రానా వెంటనే కత్రినా కైఫ్ పేరు చెప్పాడు. దీనిపై ప్రభాస్ స్పందన కోరగా, ఆయన సిగ్గుతో ఆ ప్రశ్నను దాటవేశాడు. ఇక చాలా ఏళ్లుగా తన 'బాహుబలి' సహనటి అనుష్క శెట్టితో ప్రభాస్‌కు ప్రేమాయణం ఉందంటూ వార్తలు వస్తున్నప్పటికీ, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వారు చాలా సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.