రోజూ ఇంద్రధనస్సులతో ముస్తాబయ్యే ‘రెయిన్‌బో క్యాపిటల్‌’ ఎక్కడుందో తెలుసా?

Hawaii Rainbow Capital of the World
  • ప్రపంచ ఇంద్రధనస్సుల రాజధానిగా హవాయికి గుర్తింపు
  • పసిఫిక్ సముద్ర గాలులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయలే కారణం
  • రాత్రి పూట వచ్చే ‘మూన్‌బోస్’ ప్రత్యేకం
  • ఇంద్రధనస్సుల కోసం ప్రత్యేక యాప్
ఆకాశంలో రంగుల హరివిల్లు కనిపిస్తే చాలు.. మనం పనులన్నీ పక్కన పెట్టి మరీ ఆసక్తిగా చూస్తాం. కానీ ఓ నగరంలో మాత్రం రోడ్డుపై వెళ్లేవాళ్లు ఇంద్రధనస్సును చూసి కనీసం తల కూడా పైకెత్తరు. ఎందుకంటే అక్కడ అవి ఏర్పడడం చాలా సాధారణమైన విషయం. ఉదయం కాఫీ తాగే సమయానికే కళ్లముందు డబుల్ రెయిన్‌బోలు ప్రత్యక్షమవుతాయి. అందుకే ఆ ప్రాంతాన్ని ప్రపంచ ‘ఇంద్రధనస్సుల రాజధాని’ అని పిలుస్తారు. అదే అమెరికాలోని పసిఫిక్ సముద్ర తీరాన ఉన్న ‘హవాయి’ దీవుల సమూహం.

ఎందుకీ ‘రెయిన్‌బో క్యాపిటల్’ బిరుదు?
హవాయిని అధికారికంగా ‘రెయిన్‌బో స్టేట్’ అని పిలుస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ ఉంది. ఇక్కడి పసిఫిక్ సముద్ర గాలులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని లోయల కారణంగా ఓవైపు ఎండ కాస్తుండగానే.. మరోవైపు చిన్నపాటి జల్లులు కురుస్తాయి. ఈ వింత వాతావరణం వల్లే ఇక్కడ నిరంతరం అద్భుతమైన ఇంద్రధనస్సులు ఏర్పడుతుంటాయి. స్వచ్ఛమైన గాలి కారణంగా ఇక్కడి రంగులు చాలా స్పష్టంగా, విభిన్న రూపాల్లో మెరుస్తాయి.

రాత్రి వేళల్లో ‘చంద్ర ధనస్సు’!
హవాయికి సంబంధించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ పగటిపూటే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇంద్రధనస్సులు వస్తాయి. వీటిని ‘మూన్‌బోస్’ లేదా ‘చంద్ర ధనస్సులు’ అంటారు. పౌర్ణమి రోజుల్లో చంద్రుడి వెలుతురు వర్షపు బిందువులపై పడినప్పుడు చీకటి ఆకాశంలో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. అంతేకాదు, ఇక్కడ ఇంద్రధనస్సులను కనిపెట్టడానికి ‘రెయిన్‌బో చేజ్’ అనే ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను కూడా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ఏ సమయంలో, ఏ లోయలో ఇంద్రధనస్సు వస్తుందో ముందే చెప్పేస్తుంది.
Go Back to Shorts
Hawaii
Rainbow Capital
Rainbow State
Moonbows
Pacific Ocean
Rainbow Chase App
Weather
Double Rainbows
Honolulu

More Telugu News