టెక్కీ సూపర్ ఐడియా.. ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్.. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తూ లక్షల్లో సంపాదన!
- ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న న్యూయార్క్ టెక్కీ
- పెంపుడు కుక్కలకు లగ్జరీ సేవలు అందిస్తూ నెలకు రూ.5.72 లక్షలకు పైగా ఆదాయం
- ఉదయం, సాయంత్రం, వారాంతాల్లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే కోబీ గుడ్‌హార్ట్
- భవిష్యత్తులో దీన్నే పూర్తి స్థాయి వృత్తిగా మార్చుకోవడమే లక్ష్యమని వెల్లడి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ సైడ్ హజిల్ (పార్ట్ టైం పని ద్వారా సంపాదన) ద్వారా అదనపు ఆదాయం సంపాదించడం కొత్తేమీ కాదు. కానీ, న్యూయార్క్‌కు చెందిన ఓ టెక్కీ మాత్రం తనకున్న అభిరుచినే సైడ్ హజిల్ గా మార్చుకుని నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నాడు. పెంపుడు జంతువుల సంరక్షణతో ఆదాయం పొందుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న 28 ఏళ్ల కోబీ గుడ్‌హార్ట్ ఓ టెక్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెంపుడు జంతువులంటే ఎనలేని ప్రేమ. ఈ ఇష్టాన్నే వ్యాపారంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2025లో ‘గుడ్‌హార్ట్ డాగ్ కో’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. తన ఫుల్‌టైమ్ ఉద్యోగానికి ఎలాంటి ఆటంకం కలగకుండా పెంపుడు కుక్కలకు ప్రీమియం సంరక్షణ సేవలను అందించడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే అతని వ్యాపారం ఊపందుకుంది. ప్రస్తుతం ఈ సైడ్ హజిల్ ద్వారా నెలకు 6,000 డాలర్లకు పైగా (సుమారు రూ.5.72 లక్షలు) సంపాదిస్తున్నాడు.
పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. గుడ్‌హార్ట్ తన వ్యాపార ప్రణాళికను వివరించాడు. తన ఉద్యోగ సమయాలకు అనుగుణంగానే ఈ డాగ్ వాకింగ్ షెడ్యూల్ రూపొందించుకున్నట్లు తెలిపాడు. "ఉదయం ఆఫీస్‌కు వెళ్లే ముందు, లంచ్ బ్రేక్‌లో, సాయంత్రం, అలాగే వారాంతాల్లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తాను. నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు కుక్కల సంరక్షణ చూసుకోవడానికి మరో వాకర్‌ను నియమించుకున్నా. భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని మరింతగా విస్తరించి, దీన్నే నా పూర్తిస్థాయి వృత్తిగా మార్చుకోవాలన్నది నా లక్ష్యం" అని గుడ్‌హార్ట్ చెప్పాడు.
ప్రస్తుతం గుడ్‌హార్ట్, అతని సహాయకురాలు కలిసి రోజూ 10 నుంచి 20 కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా ప్రచారం ద్వారానే తన క్లయింట్ల సంఖ్య పెరిగిందని అతను చెప్పాడు. "ఒక చిన్న ప్రాంతంలో మంచి సేవలు అందిస్తే, దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. వాకింగ్‌కు వెళ్లినప్పుడు బిల్డింగ్ డోర్‌మెన్‌లకు నా బిజినెస్ కార్డులు ఇస్తుంటాను. వారికి బిల్డింగ్‌లోని అందరితో పరిచయాలు ఉంటాయి" అని తన మార్కెటింగ్ రహస్యాన్ని వెల్లడించాడు.
న్యూయార్క్ లాంటి నగరాల్లో ప్రజలు తీవ్రమైన ఒత్తిడితో, బిజీగా ఉంటారని, అలాంటి వారు తమ పెంపుడు జంతువుల సంరక్షణ బాధ్యతను నమ్మకమైన వారికి అప్పగించడానికి ఇష్టపడతారని గుడ్‌హార్ట్ పేర్కొన్నాడు. తనది ఒక లగ్జరీ సర్వీస్ అని, అందుకే కుక్క సైజు, ప్రవర్తన, లొకేషన్ వంటి అంశాలను బట్టి ధరలు ఉంటాయని స్పష్టం చేశాడు. తాను అందించే సేవల్లో ఆ నాణ్యత ప్రతిబింబిస్తుందని అతను వివరించాడు.