హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే నమ్మించి.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
- ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
- టీ తాగుదామని పిలిచి, మద్యం తాగించి అత్యాచారం
- బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడే ఓ బీటెక్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టీ తాగుదామని పిలిచి, బలవంతంగా మద్యం తాగించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల విజయ్, ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనతో పాటే చదువుతున్న యువతితో అతనికి స్నేహం ఉంది. ఈ నెల 14వ తేదీ రాత్రి, టీ తాగుదామని విజయ్ ఆ యువతిని బయటకు పిలిచాడు. ఆమె అంగీకరించడంతో తన కారులో దిల్‌సుఖ్‌నగర్ తీసుకెళ్లాడు.
తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం యువతిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన యువతి, తనపై అత్యాచారం జరిగిందని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 17న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిన్న నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.