నా జీతం రూ.80 వేలు.. ఖర్చులు రూ.55 వేలు... ఏ కారు కొనాలి?... ఏఐ చెప్పిన సమాధానం ఏంటంటే...!
- ఏ కారు కొనాలో చెప్పమంటూ ఏఐకి ఓ వ్యక్తి ప్రశ్న
- రూ.15,000 మించని ఈఎంఐ, రూ.12 లక్షల లోపు బడ్జెట్‌కే కట్టుబడాలని ఏఐ సూచన
- విశ్వసనీయత, మైలేజ్ పరంగా మారుతి బ్రెజా ఉత్తమ ఎంపిక అని చెప్పిన చాట్‌జీపీటీ
- భద్రతకు టాటా నెక్సాన్, ఫీచర్లకు కియా సోనెట్‌ను ప్రత్యామ్నాయాలుగా సిఫార్సు
- కారు భారం కావొద్దు, పొదుపు ముఖ్యమని కీలక ఆర్థిక సలహా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన జీవితాల్లో ఒక సాధారణ భాగంగా మారిపోయింది. చిన్న చిన్న సందేహాల నుంచి క్లిష్టమైన విషయాల వరకు ఏఐ చాట్‌బాట్‌లను అడిగి తెలుసుకుంటున్నాం. ఇదే క్రమంలో, ఓ వ్యక్తి తన నెలవారీ జీతానికి ఏ కారు కొంటే బాగుంటుందని నేరుగా చాట్‌జీపీటీని అడగ్గా, అది ఊహించని విధంగా పూర్తి ఆర్థిక ప్రణాళికతో కూడిన సమాధానం ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే, 30 ఏళ్ల వివాహితుడైన ఒక వ్యక్తి, "నా వయసు 30, ఢిల్లీలో ఉంటాను. నెల జీతం రూ.80,000. ఇంటి అద్దెకు రూ.15,000, ఇతర ఖర్చులకు రూ.40,000 అవుతాయి. నేను ఏ కారు కొనాలి?" అని చాట్‌జీపీటీని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చాట్‌జీపీటీ అద్భుతమైన విశ్లేషణ ఇచ్చింది. వినియోగదారుడి లెక్కల ప్రకారం, నెల ఆదాయం రూ.80,000, ఖర్చులు రూ.55,000 పోగా, నెలకు రూ.25,000 మిగులుతాయని లెక్క కట్టింది. అతడు నిరభ్యంతరంగా కారు కొనుగోలు చేయొచ్చని, కానీ ఆర్థిక భారం కాకుండా చూసుకోవాలని సూచించింది.
చాట్‌జీపీటీ ఇచ్చిన సిఫార్సులు:
ఈఎంఐ: నెలవారీ ఈఎంఐ రూ.10,000 నుంచిరూ.15,000 మధ్యే ఉండాలి.
బడ్జెట్: కారు ఆన్-రోడ్ ధర రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల లోపు ఉంటేనే ఉత్తమం. రూ.15 లక్షలు దాటితే భవిష్యత్ పొదుపు, పెట్టుబడులపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
టాప్ రికమెండేషన్: అన్ని అంశాలనూ బేరీజు వేసి మారుతి సుజుకి బ్రెజాను ఉత్తమ ఎంపికగా సూచించింది. విశ్వసనీయత, మంచి రీసేల్ విలువ, తక్కువ నిర్వహణ ఖర్చు, ఢిల్లీ ట్రాఫిక్‌కు అనువైన మైలేజ్ దీనికి కారణాలుగా పేర్కొంది.
ఇతర ఆప్షన్లు: భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తే టాటా నెక్సాన్, ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే కియా సోనెట్, స్మార్ట్ సెడాన్ ఆప్షన్‌గా హోండా అమేజ్‌ను సూచించింది.
అంతేకాదు, మొత్తం పొదుపును డౌన్ పేమెంట్‌కు వాడొద్దని, 20-30 శాతం డౌన్ పేమెంట్ చేసి 4-5 ఏళ్ల లోన్ తీసుకోవడం మంచిదని సలహా ఇచ్చింది. "కారు అనేది జీవితాన్ని సులభతరం చేయాలి తప్ప, నెలవారీ ఆర్థిక ఒత్తిడికి కారణం కాకూడదు" అని చెప్పడం ఈ విశ్లేషణలో హైలైట్‌గా నిలిచింది.