సినిమా సీన్.. కారును ఢీకొట్టి గాల్లోకి లేచిన బైక్.. ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి వేలాడిన వైనం!
- కెనడాలో కారు, బైక్ ఢీ... గాల్లోకి ఎగిరి సిగ్నల్ స్తంభానికి చిక్కుకున్న బైక్
- ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలు... ఆసుపత్రికి తరలింపు
- ట్రాఫిక్ లైట్‌కు వేలాడుతున్న బైక్‌ను చూసి జనం ఆశ్చర్యం
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఒక విచిత్రమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా సీన్‌ను తలపించేలా కారును ఢీకొట్టిన ఒక బైక్ అమాంతం గాల్లోకి ఎగిరి సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి చిక్కుకుని వేలాడింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
డెల్టా పోలీసుల వివరాల ప్రకారం సర్రే-డెల్టా సరిహద్దులోని స్కాట్ రోడ్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక కారు, మోటార్ సైకిల్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి కానీ ప్రాణాపాయం తప్పిందని, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
ప్రమాదం జరిగిన తీరును, రద్దీగా ఉండే కూడలిలో ట్రాఫిక్ లైట్‌కు వేలాడుతున్న బైక్‌ను చూసి స్థానికులు, ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఈ వింత దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించేందుకు, చూసేందుకు జనం గుమిగూడారు. సమీపంలోని దుకాణానికి వెళుతున్న విలియం చాన్ అనే ప్రత్యక్ష సాక్షి, మొదట రోడ్డు మధ్యలో దెబ్బతిన్న కారును చూశానని, ఆ తర్వాత తల పైకెత్తి చూస్తే వేలాడుతున్న బైక్ కనిపించిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక, ఈ ప్రమాదం కారణంగా సహాయక సిబ్బంది వాహనాలను తొలగించి, రోడ్డును క్లీన్ చేసేందుకు స్కాట్ రోడ్‌లోని 70వ అవెన్యూ, 72వ అవెన్యూ మధ్య రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.