ఆ ఆదాయం మనకే రావాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన
- 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
- పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
- స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచన
- ప్రత్యేక ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం
"ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత, సరైన బ్రాండింగ్ జోడిస్తే వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. తద్వారా మన రాష్ట్ర ఆదాయం మనకే దక్కుతుంది," అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనం రోజూ వినియోగించే ఎన్నో వస్తువుల కొనుగోలు ద్వారా మన డబ్బు విదేశాలకు వెళుతోందని, ఈ పరిస్థితిని మార్చి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై సమీక్షిస్తూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "అరకు కాఫీ ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్‌గా నిలిచిందో, అదే స్ఫూర్తితో ఏపీలోని ప్రతీ జిల్లా నుంచి ప్రత్యేక ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలి" అని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈలు
రాష్ట్రానికి వస్తున్న భారీ పరిశ్రమలకు అనుబంధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు.
"గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం వల్లే క్యారియర్ ఏసీ సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో డేటా సెంటర్లకు అవసరమైన బల్క్ చిల్లర్స్‌ను ఇక్కడి నుంచే సరఫరా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా, అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌కు అవసరమైన పరికరాలను తయారుచేసే ఎకోసిస్టమ్‌లో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాలి" అని ఆయన వివరించారు. పారిశ్రామిక పార్కులు, ఉత్పత్తి కేంద్రాల వద్ద ఈ ఎంఎస్ఎంఈ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
అడ్డంకులు తొలగించి.. అభివృద్ధికి మార్గం
పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపుల వంటి ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. 22ఏ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీల ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అభివృద్ధిలో భూ యజమానులను భాగస్వాములను చేయడం ద్వారానే ఏపీలో భూసేకరణ వివాదరహితంగా సాగుతోందని, రాజధానికి 33 వేల ఎకరాల భూ సమీకరణ ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు.
సమగ్ర అభివృద్ధికి బహుముఖ వ్యూహం
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని సీఎం తెలిపారు. రవాణా ఖర్చులు తగ్గిస్తేనే రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనం కలుగుతుందని, ఇందుకోసం రోడ్డు, రైలు మార్గాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రూ.1 లక్ష కోట్లతో 64 జాతీయ రహదారులు, రూ.64 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు ప్రజలపై వైద్య ఖర్చులు, విద్యుత్ భారం తగ్గించడంపైనా దృష్టి సారించాలన్నారు. ప్రీవెంటివ్ హెల్త్‌కేర్‌తో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ స్వయంసమృద్ధి సాధించాలని సూచించారు. అసంఘటిత కార్మికుల కోసం లేబర్ అడ్డాలు నిర్మించి, వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాయలసీమను సోలార్, ఉద్యాన రంగాలకు, ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా, చిత్తూరు జిల్లాలోని కోసల నగరాన్ని మరో శ్రీసిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలను వివరించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను క్షేత్రస్థాయిలో చూపించాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు.