టీపీసీసీ సోషల్ మీడియా ఛైర్మన్‌గా నవీన్ పెత్తెం
- తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు
- మీడియా, పబ్లిసిటీ శాఖ ఛైర్మన్‌గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
- సోషల్ మీడియా కోఆర్డినేటర్ పదవిని తిరస్కరించిన గీత అయినాల
- ఈ నియామకాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో పలు కీలక నియామకాలు జరిగాయి. టీపీసీసీ సోషల్ మీడియా విభాగానికి నూతన ఛైర్మన్‌గా నవీన్ పెత్తెంను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది. అలాగే మీడియా, పబ్లిసిటీ విభాగం ఛైర్మన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్‌గా పనిచేసిన నవీన్ పెత్తెం, ప్రస్తుతం రాష్ట్ర రవాణా అథారిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయనతో పాటు సోషల్ మీడియా విభాగానికి కన్వీనర్లుగా కె.ఉజ్వల్ రెడ్డి, పి.వంశీకృష్ణలను నియమించారు. అంబాల శివకుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి, వీరాపురం రామ్ లక్ష్మణ్, గీత అయినాల, ఎండీ అబిద్ అలీ, సుశీల్ కుమార్‌లను కోఆర్డినేటర్లుగా ఎంపిక చేశారు.
అయితే, సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్ పదవిని స్వీకరించేందుకు గీత అయినాల నిరాకరించారు. ప్రస్తుతం టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ కన్వీనర్‌గా ఉన్న ఆమె, ఈ నియామకం పట్ల ధన్యవాదాలు తెలుపుతూనే, ఈ పదవిని తాను స్వీకరించడం లేదని ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. తన పేరును జాబితా నుంచి తొలగించాలని నవీన్ పెత్తెంను కోరారు. ఆమె నిరాకరణకు గల కారణాలు వెంటనే తెలియరాలేదు. మరోవైపు, నవీన్ పెత్తెం నియామకంపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మద్దతుదారులు విమర్శలు గుప్పించారు.
కొత్త బాధ్యతలపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. తనకు ఈ అవకాశం కల్పించిన ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ వాణిని తెలంగాణ అంతటా బలంగా వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు.