డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో!

Taxi Driver Malaysia Woman Jumps from Moving Taxi Fearing Driver
  • మలేషియాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఘటన
  • వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకడంతో మహిళకు గాయాలు
  • డ్రైవర్ తనను అనుమానాస్పదంగా చూస్తున్నాడని ఆరోపణ
  • ట్రిప్ రద్దు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్
మలేషియాలో ఓ మహిళ కదులుతున్న ట్యాక్సీలో నుంచి రద్దీగా ఉండే హైవేపైకి దూకేసింది. ట్యాక్సీ డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో, తనకేదో ప్రమాదం జరగబోతోందనే భయంతో ఆమె ఈ సాహసానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నార్త్ క్లాంగ్ జిల్లా పోలీసుల కథనం ప్రకారం మే 1వ తేదీ ఉదయం ఈ సంఘటన జరిగింది. ట్యాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో 47 ఏళ్ల డ్రైవర్ తనను రియర్ వ్యూ మిర్రర్ నుంచి పదేపదే అనుమానాస్పదంగా చూస్తున్నాడని మహిళ ఆందోళన చెందింది. భయాందోళనతో ఆమె కదులుతున్న వాహనం డోర్ తెరిచి రోడ్డుపైకి దూకేసింది. ఈ క్రమంలో ఆమె ఫోన్, చెప్పులు వంటి వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెనుక వస్తున్న వాహనదారులు అప్రమత్తమై వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మహిళ కిందకు దూకగానే డ్రైవర్ వెంటనే ట్యాక్సీని ఆపి, ట్రిప్ రద్దు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు గాయపడిన మహిళను సమీపంలోని క్లినిక్‌కు తరలించి సహాయం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, డ్రైవర్ తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Taxi Driver Malaysia
Malaysia taxi
Woman jumps from taxi
Highway incident
North Klang police
Taxi passenger safety
Road accident Malaysia
Suspicious driver behavior

More Telugu News