మలయాళ రీమేక్‌లు తెలుగులో అంత ఈజీ కాదు.. జేడీ చక్రవర్తి
- మలయాళ సినిమాలు సహజంగా, నెమ్మదిగా సాగుతాయన్న జేడీ
- తెలుగు ప్రేక్షకులు వేగం, కమర్షియల్ హంగులను కోరుకుంటారని వ్యాఖ్య
- మలయాళ సినిమాల కథను మన ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్చుకోవాలన్న జేడీ
తన కొత్త సినిమా 'గాయపడ్డ సింహం' ప్రమోషన్లలో బిజీగా ఉన్న జేడీ చక్రవర్తి... మలయాళ సినిమాల రీమేక్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... మలయాళ సినిమాలు చాలా సహజంగా, నెమ్మదిగా సాగుతాయని.. కానీ తెలుగు ప్రేక్షకులు వేగం, కమర్షియల్ హంగులను కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. 'భీమ్లా నాయక్', 'గాడ్ ఫాదర్' వంటి సినిమాలు హిట్ అయ్యాయంటే, అవి ఒరిజినల్ కథను మన మాస్ ఆడియన్స్‌కు తగ్గట్టుగా మార్చుకోవడం వల్లే సాధ్యమైందని విశ్లేషించారు.
అక్కడ వర్కవుట్ అయిన ప్రయోగాత్మక కథలు ఇక్కడ గుడ్డిగా తీస్తే ఫ్లాప్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుందని మేకర్స్‌ను హెచ్చరించారు. వాళ్ల నేటివిటీ వేరు, మన నేటివిటీ వేరు అని తెలిపారు. సినిమాను ఏమాత్రం మార్చకుండా మక్కీకి మక్కీ దించేస్తూ రీమేక్ చేస్తే, ఫ్లాప్ అవుతుందని చెప్పారు.